Homeహైదరాబాద్latest Newsఎడతెరిపిలేని వర్షాలు.. విద్యార్థులకు అలర్ట్.. ఈ జిల్లాల్లో పాఠశాలలకు సెలవు..!

ఎడతెరిపిలేని వర్షాలు.. విద్యార్థులకు అలర్ట్.. ఈ జిల్లాల్లో పాఠశాలలకు సెలవు..!

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలహీనపడుతోందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడన ప్రభావంతో ఏపీలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా కోస్తా ఆంధ్రలోని పలు జిల్లాల్లో చెరువులు, కాలువలు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పలు జిల్లాల్లో నదులు పొంగిపొర్లుతున్నాయి. జోరున వర్షం కురుస్తోంది. దీంతో ఆయా జిల్లాల కలెక్టర్లకు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలని కోరింది. ఈ క్రమంలోనే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఉమ్మడి పశ్చిమ గోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లాలో సోమవారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. భారీ వర్షాలు కొనసాగుతున్నట్లు మరికొన్ని జిల్లాలో కూడా విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించే ఛాన్స్ ఉంది.

Recent

- Advertisment -spot_img