Homeహైదరాబాద్latest Newsఆ కేసులో రేవంత్ రెడ్డి జైలుకు వెళితే.. ముఖ్యమంత్రి ఎవరు..?

ఆ కేసులో రేవంత్ రెడ్డి జైలుకు వెళితే.. ముఖ్యమంత్రి ఎవరు..?

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న విషయం మనకు తెలిసిందే. ఈ సెన్సేషనల్ కేసు ప్రస్తుతం సుప్రీం కోర్టు లో ఉంది. దీని విచారణ త్వరలోనే ముగుస్తోంది. అయితే తెలంగాణ ఏసీబీ కోర్ట్ లో, లేదంటే వేరే రాష్ట్రంలోని కోర్టులో ట్రయిల్ జరుగుతుంది. ఈ ఏడాది చివరికల్లా విచారణ మొదలైతే వచ్చే ఏడాదిలో జడ్జిమెంట్ గ్యారంటీ. ఈ కేసులో
రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా 50 లక్షల నగదుతో దొరికిపోయాడు. ఆడియో, వీడియో సాక్షాలు పక్కాగా ఉన్నందున రేవంత్ రెడ్డి కి శిక్ష తప్పదని, జైలుకు వెళ్లడం ఖాయమని న్యాయ నిపుణుల అభిప్రాయపడుతున్నారు.

మరి అప్పుడు తెలంగాణ కి సీఎం ఎవరు..?
రేవంత్ రెడ్డి ఎవరి పేరు సూచిస్తే వారే సీఎం అవుతారని భావిస్తున్నారు. అందుకే ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు రేవంత్ రెడ్డి తో సయోధ్యతో మెలుగుతున్నారని అంటున్నారు. అయితే రేవంత్ రెడ్డి మాత్రం ఒక అంగీకారం ప్రకారం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నాడని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Recent

- Advertisment -spot_img