Homeహైదరాబాద్latest Newsకేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీరని అన్యాయం: ఉపాధ్యక్షుడు చింత అశోక్ కుమార్

కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీరని అన్యాయం: ఉపాధ్యక్షుడు చింత అశోక్ కుమార్

ఇదేనిజం, లక్షెట్టిపేట: పార్లమెంటులో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్ట్ జిల్లా ఉపాధ్యక్షుడు చింత అశోక్ కుమార్ విమర్శించారు. బుధవారం ఆయన నివాసంలో మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక బడ్జెట్ ప్రవేశపెట్టిందని విమర్శించారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు నిధుల కేటాయింపు సరిగా లేదని అన్నారు. తెలంగాణలో ఇద్దరు కేంద్ర మంత్రులు, ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రానికి మాత్రం బడ్జెట్లో మోడీ ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు. మోడీకి ఆదాని, అంబానీల మీద ఉన్న ప్రేమ రాష్ట్రం పైన లేదని మండిపడ్డారు. నిరుద్యోగులకు బడ్జెట్లో అన్యాయం జరిగిందన్నారు.

Recent

- Advertisment -spot_img