మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు ప్రతిపక్ష నేత హోదా లో మొదటి సారి అసెంబ్లీకి రానున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని స్వయంగా బీఆర్ఎస్ వర్గాలే తెలిపాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ దూరంగా ఉంటూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలకూ ఆయన గైర్హాజరయ్యారు. కేవలం ఎమ్మెల్యేగా ప్రమాణం చేయడానికి మాత్రమే ఒక్కసారి ఆయన అసెంబ్లీకి వచ్చారు. ప్రస్తుతం 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెడుతున్న నేపథ్యంలో కేసీఆర్ అసెంబ్లీకి రానున్నట్లు తెలుస్తోంది.