Homeహైదరాబాద్latest Newsభారీ వర్షాల పట్ల గొర్రెల కాపరులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి: పలుమారు మల్లేష్ యాదవ్

భారీ వర్షాల పట్ల గొర్రెల కాపరులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి: పలుమారు మల్లేష్ యాదవ్

ఇదే నిజం, ఎండపల్లి: రాష్ట్రవ్యాప్తంగా గత వారం రోజులుగా ఈదురు గాలులతో భారీ వర్షం కురుస్తున్నందున గొర్రెల కాపరులు తగిన జాగ్రత్తలు తీసుకొని, అప్రమత్తంగా ఉండాలని అఖిల భారత యాదవ మహాసభ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు పలుమారు మల్లేష్ యాదవ్ సూచించారు. వారం రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల మూలంగా పెద్ద వాగులు, ఒర్రెలు పొంగిపొర్లుతున్నాయని, గొర్రె కాపరులు తమ జీవాలను వాగులు, ఒర్రెలు దాటించేటప్పుడు జాగ్రత్తగా దాటించాలని సూచించారు. అలాగే పిడుగులు పడే సమయంలో గొర్రెల కాపర్లు చెట్ల కింద ఉండకూడదని పేర్కొన్నాడు. ముఖ్యంగా గొర్రె మేకల కాపరులు వర్షాకాలం లో తమ జీవాలకు సంభవించే సీజనల్ వ్యాధులు గాలికుంటు, నీలి నాలుక ల పట్ల జాగ్రత్త వహించి, బ్లూ టంగ్ వ్యాక్సిన్ మరియు నీలి నాలిక వ్యాధి కి మరియు పుట్ రాట్ వ్యాక్సిన్ లు వేయించాలని తెలియజేస్తూ, గొర్రెల కాపరులంతా వర్షాకాలంలో తమ జీవాలను కాపాడుకునేందుకు అత్యంత అప్రమత్తంగా ఉండాలని కోరారు.

Recent

- Advertisment -spot_img