మధ్యప్రదేశ్లోని రేవా జిల్లా జావా ప్రాంతంలో జరిగిన దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. 3 నెలల క్రితం 13 ఏళ్ల బాలుడు రాత్రి వేళ మొబైల్ ఫోన్లో పోర్న్ వీడియోలు చూశాడు. ఆ సమయంలో తన సోదరి (9)పై అత్యాచారం చేశాడు. అనంతరం బాలికను హత్య చేశాడు. అయితే బాలుడిని తల్లి, ఇద్దరు అక్కలు కాపాడేందుకు యత్నించారు. సాక్ష్యాలను ధ్వంసం చేశారు. DNA పరీక్షల తర్వాత బాలుడిని పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు.