తెలంగాణ అసెంబ్లీ ఒక్క రోజు విరామం తర్వాత నేడు తిరిగి ప్రారంభమైంది. ఇవాళ మొత్తం 19 పద్ధులపై శాసనసభలో చర్చ జరుగనుంది. పద్దుల్లో ప్రధానంగా ఆర్థిక నిర్వహణ , ఆర్థిక ప్రణాళిక, విద్యుత్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్, పరిశ్రమల, ఐటి, ఎక్సైజ్ హోం, కార్మిక ఉపాధి,రవాణ, బీసీ సంక్షేమం,పాఠశాల విద్యా, ఉన్నత విద్యా, సాంకేతిక విద్యా, మెడికల్ అండ్ హెల్త్ తదితర పద్దులపై చర్చించనున్నారు.