ఉత్తరప్రదేశ్ లోని ప్రతాప్‌గఢ్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ వివాహిత మెడలో చెప్పుల దండ వేసి, ముఖానికి నలుపు రంగు పూసి చెట్టుకు కట్టేసి హింసించారు. హథిగ్వాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇబ్రహీంపూర్ గ్రామంలో ఈ దారుణం జరిగింది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో సదరు మహిళ అక్రమ సంబంధం పెట్టుకుందనే ఆరోపణతో పంచాయతీ ఈ మేరకు తీర్పు ఇచ్చింది. ఈ ఘటన ఆమె ఇద్దరు కొడుకులు, కూతుళ్ల ఎదుటే జరిగడం గమనార్హం. ఈ ఘటనలో 15 మందిని పోలీసులు అరెస్టు చేశారు.