Homeహైదరాబాద్latest Newsవాకింగ్ చేయరా..నాయనా.. ఎన్ని లాభాలో తెలుసా?

వాకింగ్ చేయరా..నాయనా.. ఎన్ని లాభాలో తెలుసా?

మనం ఆరోగ్యాంగా ఉండాలంటే ఎక్సర్ సైజ్ చేయాలి. కానీ, చాలా మందికి ఎక్సర్ సైజ్ చేయడం ఇష్టం ఉండదు. అలాంటి వాళ్లు కనీసం వాకింగ్ చేస్తే మంచిదని నిపుణులు చెప్తున్నారు. వాకింగ్ చేయడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. అంతేకాకుండా వాకింగ్ చేయడం చాలా ఈజీ కూడా. బయటికి వెళ్లి వాకింగ్ చేయడం కుదరని వాల్లు ట్రెడ్ మిల్ పై వాకింగ్ చేసినా మంచి లాభాలే ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.

వాకింగ్ చేస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం..

  • ప్రతి రోజు వాకింగ్ చేయడం వల్ల కేలరీలు ఎక్కువగా కరుగుతాయని అంటున్నారు నిపుణులు. జాగింగ్ చేయడం కంటే వాకింగ్ చేస్తేనే ఎక్కువ కేలరీలు కరుగుతాయని చాలా రిసెర్చ్ ల్లో తేలింది.
  • వాకింగ్ చేయడం వల్ల కేలరీలు కరగడమే కాకుండా.. ఒంట్లోని కొవ్వు కూడా కరిగిపోతుంది. అయితే, అది మనం తినే తిండిని బట్టి కూడా ఉంటుందని అని చెప్తున్నారు నిపుణులు.
  • వాకింగ్ చేసినప్పుడు వివిధ కండరాలు పనిచేస్తాయి. దానివల్ల అవి గట్టిపడి దృఢంగా తయారు అవుతాయి. ముఖ్యంగా కాళ్లలోని కండరాలు, ఎముకలు స్ట్రాంగ్ అవుతాయి.
  • ప్రస్తుతం చాలామందిలో బీపీ సమస్య ఉంది. అయితే, రోజు వాకింగ్ చేస్తే ఆ సమస్య తగ్గుందని అంటున్నారు. బీపీ కంట్రోల్ లో ఉండటం వల్ల హార్ట్ బాగా పనిచేస్తుందని, ప్రతి రోజు చేసే ఎక్సర్ సైజ్ లకి వాకింగ్ యాడ్ చేస్తే బ్లడ్ ప్రజర్ కంట్రోల్ ఉంటుందని రిసెర్చ్ లో తేలినట్లు నిపుణులు చెప్పారు.

Recent

- Advertisment -spot_img