ఇదేనిజం, ముస్తాబాద్: రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం సేవాలాల్ తండాలో నిద్రిస్తున్న వృద్దురాలుపై వీధి కుక్కలు దాడి చేసి చంపివేయడం కలకలం లేపింది. పిట్ల రాజ్యలక్ష్మి అనే వృద్దురాలని కుక్కలు దాడిచేసి ఇష్టమొచ్చిన రీతిలో దాడి చేసి మెడ భాగాన్నిశరీరం నుండి వేరు చేసి భయానకం సృష్టించాయి. ప్రతిరోజులాగే వ్యవసాయ పనులనుండి వచ్చిన కుమారులు రాజ్యలక్ష్మికి భోజనం పెట్టి నిద్రించారు. తలుపుగడియ పెట్టకపోవడముతో, ఇంట్లోకి చొరబడిన కుక్కలు అతిక్రూరముగా వృద్దురాలుపై దాడిచేసి ఆమె శరీరాన్ని ఆరుబయటకు లాక్కొని వచ్చాయి. శరీరాన్ని ఛిద్రం చేయడముతో, రాజ్యలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందగా, ఈ సంఘటనతో తండాలోని ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కుక్కలను కట్టడి చేయాలని, ఇలాగే వదిలేస్తే మరింత ప్రమాదకరముగా మారే పరిస్థితి ఉందని అధికారులను వేడుకుంట్టున్నారు. సంఘటన స్థలానికి ఎస్సై గణేష్ చేరుకొని కుటుంబ సభ్యులను ఎలా జరిగిందని వివరాలు తెలుసుకొని అనంతరం మృతదేహాన్ని పంచనామా చేసి పోస్టుమార్టం కోసం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు.