పశ్చిమ బెంగాల్లోని మాల్దా జిల్లాలో ఓ మహిళపై సామూహిక అత్యాచారం చేశారు. ఇద్దరు వ్యక్తులు ఒక మహిళను ఆమె పశువులు పొలంలో తిరుగుతున్నాయని చెప్పి ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లారు. బలవంతంగా పాడుబడిన షెడ్లోకి ఈడ్చుకెళ్లి 2 గంటల పాటు అత్యాచారం చేశారు. ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. అయితే మహిళ తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పింది. తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది.