Homeహైదరాబాద్latest Newsఎస్బీఐ బ్యాంకును గాంధీచౌక్ లోనే కొనసాగించాలి

ఎస్బీఐ బ్యాంకును గాంధీచౌక్ లోనే కొనసాగించాలి

  • దూరం తరలిస్తే కస్టమర్లకు ఇబ్బంది
  • బ్యాంకు అధికారులు పునరాలోచించాలి

ఇదేనిజం, లక్షెట్టిపేట: గాంధీ చౌక్ లో నిర్వహిస్తున్న ఎస్బీఐ బ్యాంకును అక్కడే ఉంచాలని, దానిని వేరే చోటికి తరలిస్తే వినియోదారులు ఇబ్బంది పడాల్సి వస్తుందని కస్టమర్లు ఆందోళన చెందుతున్నారు. బస్సు దిగితే అందుబాటులో ఉండే బ్యాంకును మరొక చోటుకు మారుస్తే చిన్న చిన్న గ్రామాల నుండి వచ్చే ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు. ఉన్నత స్థాయి అధికారులు ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకొని ప్రజలకు అందుబాటులో ఉండే చోటును ఎంచుకొని బ్యాంకును మార్చాలని కస్టమర్లు కోరుతున్నాను. ఇటీవల మేనేజర్ పేపర్లో ప్రకటన ఇచ్చిన అడ్రస్ లోనే ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Recent

- Advertisment -spot_img