Homeహైదరాబాద్latest Newsబండ్లకు బుజ్జగింపులు.. కాంగ్రెస్ లో ఉండాలని వేడుకోలు.. కృష్ణమోహన్ రెడ్డి నిర్ణయమేంటి?

బండ్లకు బుజ్జగింపులు.. కాంగ్రెస్ లో ఉండాలని వేడుకోలు.. కృష్ణమోహన్ రెడ్డి నిర్ణయమేంటి?

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి 20 రోజులు తిరగకముందే బీఆర్ఎస్ గూటికి చేరుకున్నారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ నేతలు ఆయన ఇంటికి వెళ్లి బుజ్జగిస్తున్నారట. ఒక్క కృష్ణమోహన్ రెడ్డి మాత్రమే కాక చాలా మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. బీఆర్ఎస్ కేడర్ ద్రోహిగా చిత్రీకరిస్తుంటే.. కాంగ్రెస్ కేడర్ చీడపురుగుల్లా చూస్తోంది. దీంతో వాళ్లంతా దిక్కుమొక్కలేక బిక్కుబిక్కుమంటున్నారు. అయితే బండ్ల బీఆర్ఎస్ గూటికి చేరుకోవడంతో కాంగ్రెస్ అలర్ట్ అయిపోయింది. తాజాగా గురువారం ఆయన ఇంటికి వెళ్లి బుజ్జగించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం రాత్రి మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇంటికి వెళ్లారు.

ఆయనతోపాటు కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి కూడా వెళ్లినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలతో వారు భేటీ అయిన ట్టు తెలుస్తున్నది. ఈ సమావేశానికి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మినహా మిగతా ఎమ్మెల్యేలంతా హాజరైనట్టు తెలిసింది. కాంగ్రెస్‌లో చేరే వరకు తమతో సంప్రదింపులు జరిపి, ఆ తర్వాత త మను గాలికి వదిలేశారని పార్టీ మారిన ఎమ్మెల్యేలు అసంతృప్తిలో ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. తమను రాష్ట్ర, స్థానిక కాంగ్రెస్‌ నేతలు, ఇతర ఎమ్మెల్యేలు కలుపుకోవడం లేదంటూ వారు అసంతృప్తిలో ఉన్నారని తెలుస్తున్నది. అందుకే వారు అసెంబ్లీలో కూడా అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారని, ఒంటరిగా వచ్చిపోతున్నారని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ‘మాకు బీఆర్‌ఎస్‌లో ఉంటే అయినా గౌరవం ఉండేది’ అని సన్నిహితుల వద్ద వాపోతున్న ట్టు సమాచారం. మరి బండ్ల కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారా? బీఆర్ఎస్ పార్టీలోకి చేరుకుంటారా? అన్నది వేచి చూడాలి. మొత్తానికి గద్వాల ఎమ్మెల్యే తన నిర్ణయాలతో ప్రజల్లో పలుచన అవుతున్నారు.

Recent

- Advertisment -spot_img