Homeహైదరాబాద్latest Newsచేసిన సేవల ద్వారానే ప్రజల మనసుల్లో స్థానం

చేసిన సేవల ద్వారానే ప్రజల మనసుల్లో స్థానం

  • అంబేద్కర్ యువజన సంఘం నాయకులు మేకల దిలీప్
  • ఉద్యోగులకు ఘన సన్మానం

ఇదేనిజం, లక్షెట్టిపేట: ఉద్యోగులు తాము చేసిన సేవల ద్వారానే ప్రజల మనసుల్లో చిరకాలం నిలిచిపోతారని అంబేద్కర్ యువజన సంఘం నాయకులు మేకల దిలీప్ పేర్కొన్నారు. శుక్రవారం పాత కొమ్ముగూడెం గ్రామ పంచాయతీ కార్యదర్శులకు అంబేడ్కర్ యువజన సంఘం అధ్వర్యంలో బదిలీపై వెళ్లిన కార్యదర్శి వరుణ్ కుమార్ కు, బదిలీపై వచ్చిన నూతన కార్యదర్శి మోటపలుకుల రాజశేఖర్ లను గ్రామస్థులతో కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. గ్రామానికి మరువలేని సేవలు అందించిన వరుణ్ కృతజ్ఞతలు తెలిపారు. కొత్తగా బాధ్యతలు చేపడుతున్న కార్యదర్శి కూడా గ్రామానికి మంచి సేవలు అందించాలని, వర్షాకాలం వచ్చే సీజనల్ వ్యాధుల నుండి గ్రామ ప్రజలను రక్షించేందుకు శానిటరీ పనులు, దోమల మందు స్ప్రే, బ్లీచింగ్ పౌడర్, గడ్డి మందు స్ప్రే చేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంబేడ్కర్ యువజన సంఘం సభ్యులు రెగుంట వరప్రసాద్, బెక్కెమ్ జగన్, రేగుంట సుధాకర్, చొప్పదండి ప్రశాంత్, రాయాన్ సోను, కొల్లూరి కృష్ణ, రేగుంట అనిల్, ఆకనపల్లి ప్రణయ్, బెక్కేమ్అఖిల్, చరణ్ లు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img