Homeహైదరాబాద్latest Newsషాకింగ్ ఘటన.. ఠాగూర్ హాస్పిటల్ సీన్ రిపీట్.. మృతి చెందిన వ్యక్తికి ట్రీట్ మెంట్..ఏం జరిగిందంటే?

షాకింగ్ ఘటన.. ఠాగూర్ హాస్పిటల్ సీన్ రిపీట్.. మృతి చెందిన వ్యక్తికి ట్రీట్ మెంట్..ఏం జరిగిందంటే?

ఇదేనిజం, శేరిలింగంపల్లి: గచ్చిబౌలి కేర్ ఆసుపత్రిలోఉద్రిక్తత చోటు చేసుకున్నది. ఓ వ్యక్తికి చికిత్స జరుగుతున్న సమయంలో మృతి చెందాడు. ఆ విషయం చెప్పకపోగా పెద్ద మొత్తంలో డబ్బులు గుంజే ప్రయత్నం చేసి సదరు ఆసుపత్రి యాజమాన్యం అడ్డంగా బుక్కయ్యింది. వివరాల్లోకి వెళితే.. మెదక్ జిల్లా నర్సాపూర్ కు చెందిన వెంకటెష్ అనారోగ్య సమస్యలతో గచ్చిబౌలి కేర్ ఆసుత్రిలో చేరారు. అయితే చికిత్స క్రమంలో  వైద్య ఖర్చుల కోసం 5 లక్షల చెల్లించారు. గురువారం వరకు ఆరోగ్యంగా ఉన్న వెంకటేష్ శుక్రవారం తెల్లారేసరికి మృతి చెందాడు.  అయితే మృతి చెందిన విషయం దాచిపెట్టి మరీ ఆ వ్యక్తికి ట్రీట్ మెంట్ చేస్తూ  వైద్యులు రోగి బ్రతకాలంటే మరో నాలుగు లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అనుమానంతో ఐసీయూ అద్దాలు పగలగొట్టి  కుటుంబ సభ్యులు లోపలికి వెళ్లి చూడగా వెంకటేష్  అప్పటికే మృతి చెంది ఉండడం గమనార్హం. దీంతో కోపోద్రిక్తులైన కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళన  చేపట్టారు. విషయం తెలుసుకున్న నర్సాపూర్ ఎం ఎల్ ఏ సునీత రెడ్డి ఆసుపత్రి వద్ద కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Recent

- Advertisment -spot_img