ఇదే నిజం, ధర్మపురి రూరల్: ధర్మపురి పట్టణం 8వ వార్డు లో మురికి కలువలు, రోడ్లు వర్షానికి మొత్తం చేడిపోయి దుర్వాసన కొడుతున్నాయి. పట్టణంలో ఉన్న మున్సిపాలిటీలో అక్కడి ప్రజలు వెళ్లి ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు. వర్షం వచ్చినప్పుడు మురికి కాలువలు నిండి మురుగు నిరంత ఇండ్లలోనికి వచ్చిన కూడా అక్కడి అధికారులు గానీ, నాయకులు గానీ చూసి చూడనట్టు ఉంటున్నారని ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఈ సమస్యలను పరిష్కరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ పరిష్కరించాకపోతే పై అధికారుల దగ్గరకు వెళ్లి పిర్యాదు చేస్తామని అన్నారు.