బంగ్లాదేశ్‌లోని ప్రభుత్వ ఉద్యోగాల్లో 1971 స్వాతంత్య్ర పోరాట కుటుంబాలకు 30 శాతం రిజర్వేషన్లు ఇవ్వడంపై ఆ దేశంలో ఎప్పటి నుంచో నిరసనలు జరుగుతున్నాయి. అయితే సుప్రీంకోర్టు వారి రిజర్వేషన్ల శాతాన్ని 5 కి తగ్గించారు. అయినప్పటికీ నిరసనలు కొనసాగుతున్నాయి. తమను అణిచివేసేందుకు ప్రయత్నించిన ప్రభుత్వం బాధ్యత వహించాలని.. ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలంటూ ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు అనుకున్నట్లుగానే ప్రధాని షేక్ హసీనా నేడు రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిపోయారు.