Homeహైదరాబాద్latest NewsBREAKING: బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రధాని రేసులో మాజీ ప్రధాని ఖలీదా జియా? ఎవరీ ఖలీదా జియా?

BREAKING: బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రధాని రేసులో మాజీ ప్రధాని ఖలీదా జియా? ఎవరీ ఖలీదా జియా?

బంగ్లాదేశ్‌లో అల్లర్ల కారణంగా రాజకీయ అస్థిరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో మాజీ ప్రధాని ఖలీదా జియాకు అధికారం దక్కుతుందనే వాదనలు వినబడుతున్నాయి. అవినీతి ఆరోపణలతో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆమె విడుదలకు అధ్యక్షుడు మొహమ్మద్‌ షాహబుద్దీన్‌ ఆదేశాలు జారీ చేశారు. దీంతో తాత్కాలికంగా ఆమెకు ప్రధాని బాధ్యతలు అప్పగించే చాన్స్ ఉందనే ప్రచారం జరుగుతోంది.

ఎవరీ ఖలీదా జియా?
బంగ్లాదేశ్ ప్రధాని పదవి ఖలీదా జియాకు అప్పగిస్తారనే ప్రచారం నేపథ్యంలో ఆమె ఎవరనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది. ఖలీదా భర్త 1977-1981 వరకు ఆ దేశాధ్యక్షుడిగా పని చేశారు. అతడి హత్య అనంతరం రాజకీయాల్లోకి వచ్చి 1991లో తొలి మహిళా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. 2001 నుంచి 2006 వరకు మరోసారి దేశాన్ని పాలించారు. కానీ 2018లో అవినీతి కేసులో అరెస్టై జైలు శిక్ష అనుభవిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img