ఏపీలో వైసీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా అనంతపురం జిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైలా నర్సింహయ్య తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. కాగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు సైతం ఇవాళ వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.