పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్‌కు గురువారం కీలక మ్యాచ్‌లు ఉన్నాయి. భారత అథ్లెట్లు రెండు పతక ఈవెంట్లలో పోటీపడతారు. పురుషుల జావెలిన్ త్రో ఫైనల్లో గోల్డెన్ భాయ్ నీరజ్ చోప్రా బరిలోకి దిగనుండగా, కాంస్య పతక పోరులో భారత హాకీ జట్టు స్పెయిన్‌తో తలపడనుంది. భారీ అంచనాలతో పారిస్ ఒలింపిక్స్ బరిలోకి దిగి ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయిన భారత పురుషుల హాకీ జట్టు.. గురువారం కాంస్య పతకం కోసం స్పెయిన్‌తో తలపడనుంది. టోర్నీ ఆరంభం నుంచి చక్కటి ఆటతీరు కనబర్చిన హర్మన్ ప్రీత్ సింగ్ సారథ్యంలోని టీమిండియా.. సెమీఫైనల్లో జర్మనీ చేతిలో ఓడి కాంస్య పతక పోరుకు చేరింది. మూడేళ్లక్రితం జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లోనూ భారత్ కాంస్య పతకమే సాధించింది.