Homeహైదరాబాద్latest NewsHealth: వర్షాకాలంలో ఈ పండ్లను తింటే.. ఈ ఇన్ఫెక్షన్లకు చెక్ పెట్టొచ్చు

Health: వర్షాకాలంలో ఈ పండ్లను తింటే.. ఈ ఇన్ఫెక్షన్లకు చెక్ పెట్టొచ్చు

వర్షాకాలంలో చాలా మంది అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటమే అని చెప్పవచ్చు. అలాగే అపరిశుభ్రమైన నీరు త్రాగడం లేదా తినడం మరియు దోమలు కుట్టడం వల్ల కూడా మనకు వ్యాధి సోకుతుంది. ఈ సీజన్ లో మనం కొన్ని పండ్లను ఆహారంలో చేర్చుకుంటే మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో సీజనల్ వ్యాధుల నుంచి సురక్షితంగా ఉండొచ్చు.

  1. బొప్పాయిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో ఇది ఎంతగానో సహకరిస్తుందని.. అంతే కాకుండా ఇందులో ఉండే పీచు అనేక వ్యాధులతో పోరాడుతుందని చెబుతారు. కాబట్టి వర్షాకాలంలో బొప్పాయి తినడం మంచిది.
  2. చెర్రీస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి అంటు వ్యాధులను నివారిస్తాయని, మెదడుకు ప్రశాంతతను, విశ్రాంతిని అందిస్తాయని తెలుస్తుంది.
  3. రోజుకో యాపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదంటున్నారు. కారణం అందులోని పోషకాలు. ఎందుకంటే అవి అనేక వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయని చెబుతారు.
  4. వర్షాకాలంలో అధికంగా లభించే పండ్లలో దానిమ్మ ఒకటి. ఈ దానిమ్మ గింజలు అనేక పోషకాలను కలిగి ఉంటాయి. దానిమ్మలో ముఖ్యంగా విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుందని మరియు జలుబు మరియు దగ్గు వంటి వ్యాధులను నివారిస్తుందని చెబుతారు.

Recent

- Advertisment -spot_img