Homeహైదరాబాద్latest Newsప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వచ్ఛదనం-పచ్చదనం

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వచ్ఛదనం-పచ్చదనం

ఇదే నిజం, గూడూరు: గూడూరు మండల కేంద్రం పరిధిలోని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అయోధ్యాపురం గ్రామంలో డాక్టర్ బి. యమున ఆధ్వర్యంలో స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమంలో భాగంగా, ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించి 42 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. సాధారణంగా దగ్గు, జలుబు, ఒళ్ళు నొప్పులతో బాధపడుతున్న వారికి పరక్షించి మందులు ఇచ్చారు. అందులో 9 మంది జ్వర పిడుతులను గుర్తించి సిరం కలెక్షన్ చేసి, టీ హబ్ కు పంపించారు. అదేవిధంగా పి హెచ్ సి. పరిధిలో గల వంపు తండా, గిరిజన ఆశ్రమ పాఠశాల బాలికల లలో కూడా ప్రత్యేక శిబిరాలు నిర్వహించారు. అయోధ్యాపురం ప్రాథమిక ఆరోగ్య పరిధిలోని గల అన్ని గ్రామాలలో రెండు విడతల ఇంటింటి రాపిడ్ ఫీవర్ సర్వే ముగించుకొని, ప్రస్తుతం మూడవ విడత ఇంటింటి ఫీవర్ సర్వే కార్యక్రమం జరుగుతున్నది. స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమంలో భాగంగా, ఈ రోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రము, పరిధిలోని అన్ని సబ్ సెంటర్లలో పిచ్చి మొక్కలు తొలగించి, పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు.

డాక్టర్ బి. యమున మాట్లాడుతూ.. ఇంటి పరిసరాల పరిశుభ్రతతో డెంగీ, మలేరియా, చికెన్ గునియా, వంటి రోగాల బారిన పడకుండా ఉండవచ్చని, ఈ వర్షాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వ్యక్తిగత పరిశుభ్రతలు పాటించి, వేడి వేడి ఆహారము, వేడిచేసి చల్లార్చిన నీటినే తాగి, మీ ఆరోగ్యాలను కాపాడుకోవాల్సిందిగా తగు సూచనలు చేశారు. ఈ వైద్య శిబిరంలో ఆర్ బి ఎస్ కే. డాక్టర్ పుష్పలత, హెచ్ ఈ ఓ లోక్య నాయక్, హెల్త్ సూపర్వైజర్ గణేష్, హెల్త్ అసిస్టెంట్ సర్దార్ బాబు, నరేందర్ రెడ్డి, లాలు, ల్యాబ్ టెక్నీషియన్ కృష్ణ, ఏఎన్ఎంలు సమ్మక్క, గౌసియా, స్టాఫ్ నర్స్ రజిత, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img