సినిమా హీరోలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘40 ఏళ్ల క్రితం హీరోలు అడవులను రక్షించే పాత్రల్లో నటించే వారు. కానీ ఇప్పుడు అడవులను నరికేసి స్మగ్లింగ్ చేసే పాత్రలు చేస్తున్నారు’’ అని అన్నారు. దీంతో పవన్ పరోక్షంగా అల్లు అర్జున్ నటించే పుష్ప సినిమాను ఉద్ధేశించే ఈ వ్యాఖ్యలు చేశారని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
‘నేను అలాంటి సినిమాలు చేయలేను’
అడవులను విధ్వంసం చేసే సినిమాలు చేయాలంటే తాను ఇబ్బంది పడతానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. అడవులను రక్షించే సినిమాలు చేయడమే మంచిదని అభిప్రాయపడ్డారు. రియల్ లైఫ్, రీల్ లైఫ్ వేర్వేరుగా ఉన్నా మారిన కల్చర్ ఆందోళన కలిగిస్తోందని చెప్పారు.