Homeహైదరాబాద్latest Newsమళ్లీ బంగ్లాదేశ్ కు షేక్ హసీనా.. ఎప్పుడంటే?

మళ్లీ బంగ్లాదేశ్ కు షేక్ హసీనా.. ఎప్పుడంటే?

బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల అల్లర్ల నేపథ్యంలో చెలరేగిన భారీ హింసాకాండతో ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా.. దేశం విడిచి భారత్‌లో తలదాచుకున్నట్లు సంగతి తెలిసిందే. అయితే బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కుమారుడు సాజిబ్ వాజాద్ జాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. మహ్మద్ యూనాస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తే.. నా తల్లి షేక్ హసీనా బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తుంది. మా అమ్మ ఇండియాలో ఉంది. ఎన్నికల సమయంలో ఆమె బంగ్లాదేశ్‌కు వెళ్లడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు.

Recent

- Advertisment -spot_img