Homeతెలంగాణస్వచ్ఛదనం - పచ్చదనంతోనే సంపూర్ణ ఆరోగ్యం: మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

స్వచ్ఛదనం – పచ్చదనంతోనే సంపూర్ణ ఆరోగ్యం: మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

ఇదేనిజం, శేరిలింగంపల్లి: స్వచ్ఛదనం – పచ్చదనంతోనే సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అన్నారు. శుక్రవారం మియాపూర్ డివిజన్ పరిధిలోని స్టాలిన్ నగర్ కాలనీలో నిర్వహించిన స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమంలో భాగంగా స్థానిక నాయకుల తో కలిసి కార్పొరేటర్ మొక్కలు నాటారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. పచ్చదనం, పరిశుభ్రతతో మన పరిసరాలు విరాజిల్లినప్పుడే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని, ప్రతి ఒక్కరూ ఇంటి వద్ద, పాఠశాలల చుట్టుపక్కల, ఖాళీ స్థలాల్లో, రోడ్ల వెంట మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని కాలనీ వాసులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు డీ ఈ దుర్గాప్రసాద్, వార్డ్ ఆఫీసర్ కృష్ణ, స్థానిక నాయకులు రాణి, వెంకటేష్, శ్యామల, దేవేందర్ భాగ్యమ్మ , లావణ్య, లక్ష్మీ, మహేష్, స్టాలిన్ నగర్ కాలనీ వాసులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img