ఇదే నిజం, గొల్లపల్లి : విశ్వహిందూ పరిషత్& బజ్ రంగ్ దళ్ గొల్లపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో బంగ్లాదేశ్ లో మైనార్టీ హిందువులు, బౌద్ధులపై జిహాదీ శక్తుల చేత జరుగుతున్న దారుణ మరణకాండను నిరసిస్తూ స్థానిక తహసిల్దార్ జమీర్ ని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా గోరక్ష సహప్రముఖ్ ఆడేపు నరేష్ మాట్లాడుతూ.. బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ వ్యతిరేక పోరాటం సాకుతో మొదలైన ఉద్యమం ఎలాంటి సంబంధంలేని అమాయక హిందూ బౌద్ధమతాల ప్రజలను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకొని వారి వ్యాపార సంస్థలను దోచుకోవడం మహిళలపై అత్యాచారాలు చేయటం ,స్థానిక నాయకులను సజీవ దహనం చేయడం లాంటి అత్యంత హేయమైన చర్యలకు పాల్పడుతూ దారుణ మరణకాండ సృష్టించి అనేక లక్షల మంది నిరాశ్రయులు అయ్యేలా దాడులు చేస్తున్న జిహాదీ శక్తులపై అంతర్జాతీయ స్థాయిలో ఒత్తిడి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మండల అధ్యక్షుడు విశ్వహిందూ పరిషత్ మండల్ల అధ్యక్షులు కుంభార్ కార్ అరుణ్, బజ్ రంగ్ దళ్ మండల్ కన్వీనర్ ఎనగందుల రమేష్, విశ్వహిందు పరిషత్ మండల గౌరవ అధ్యక్షులు తిరునహరీ సత్యనారాయణ, ప్రధానకార్యదర్శి ఆవుల వెంకటేష్, నరసాపురం రవీందర్, కట్ట మహేష్, తాడూరి శ్రీనివాస్, అన్యారంబట్ల హిమకర్, తిరుపతి, రాజు, చందు తదితరులు పాల్గొన్నారు.