నోయిడాలో రేవ్ పార్టీ కలకలం రేపింది. సెక్టార్ 94లోని సూపర్నోవా సొసైటీ ఫ్లాట్లో 20 మందికి పైగా మైనర్ విద్యార్థులు రేవ్ పార్టీ నిర్వహించారు. ఈ క్రమంలోనే మద్యం మత్తులో ఉన్న విద్యార్థులు తమతో దురుసుగా ప్రవర్తించారని పొరుగు ఫ్లాట్ వాసులు ఆరోపించారు. దీంతో పోలీసులు వారి విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి భారీగా మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు.