కొన్ని గాయాలు ఎంతకీ తగ్గవు. ముఖ్యంగా ఈ సమస్య డయాబెటిక్ రోగుల్లో ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వారి కోసం ‘ఎలక్ట్రిక్ బ్యాండేజ్’ని నార్త్ కరోలినా స్టేట్ వర్సిటీ సైంటిస్టులు తయారుచేశారు. తీవ్ర గాయాలను సైతం ఈ బ్యాండేజ్లు నయం చేయగలవని, సాధారణ బ్యాండేజ్లతో పోల్చితే 30% వేగంగా పుండు లేదా గాయం నుంచి ఉపశమనం లభిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ఎలుకలపై జరిపిన ప్రయోగాల్లో గాయాలు వేగంగా తగ్గాయట!