ఇదేనిజం, శేరిలింగంపల్లి: అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని ఫ్రెండ్స్ వెల్ఫేర్అసోసియేషన్ ఆధ్వర్యంలో హఫీజ్ పేట డివిజన్ పరిధిలో గల కల్లం అంజిరెడ్డి ఒకేషనల్ జూనియర్ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమము నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ గణేష్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా ఆచార్య దాసరి మురళీ మనోహర్ హైదరాబాదు సెంట్రల్ యూనివర్శటీ విచ్చేసి యువతను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఐక్యరాజ్యసమితి వారు ఈ యువ శక్తి ఎదుర్కుంటున్న అతి ముఖ్యమైన సమస్యలైన విద్య, ఉపాధి, చట్టపరమైన రక్షణ, సంస్కృతి పట్ల అవగాహన, పౌరసత్వం లాంటి హక్కులపై అవగాహన కల్పించి, వారికి దశ, దిశ నిర్దేశించడానికి 2000వ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం ఆగస్టు 12 నాడు ఒక ప్రత్యేకమైన నినాదంతో ఐక్యరాజ్యసమితి ఈ అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం ‘ క్లిక్ నుండి పురోగతి వరకు ‘ అనే నినాదంతో నిర్వహిస్తున్నారని అన్నారు. ” ఏ దేశ ప్రగతి అయినా, అభివృద్ధి అయినా ఎక్కువగా యువతమీదే ఆధారపడి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలేజీ ఇన్-ఛార్జ్ శ్రీనివాస్, విద్యార్థిని, విద్యార్థులు, అధ్యాపకులు మరియు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ధర్మసాగర్, జిల్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.