Homeహైదరాబాద్latest Newsమా తడాఖా చూపిస్తాం.. రేవంత్ సర్కార్ పై ఉద్యోగుల తిరుగుబాటు

మా తడాఖా చూపిస్తాం.. రేవంత్ సర్కార్ పై ఉద్యోగుల తిరుగుబాటు

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ పవర్ లోకి రావడానికి ఉద్యోగులు కూడా ఓ కారణమే. అందుకే కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత తాము ఉద్యోగులకు ఎంతో దగ్గరగా ఉంటామని.. వారి సమస్యలు ఆరుస్తాం.. తీరుస్తాం అంటూ ప్రకటించింది. ఇక వృద్ధులకు పింఛన్లు ఆపినా.. రైతులకు పెట్టుబడి సాయం ఆపినా ఉద్యోగులకు ఒకటి తారీఖునే వేతనాలు ఇచ్చామని గొప్పగా చెప్పుకున్నది కాంగ్రెస్ పార్టీ. అయితే ఇప్పుడు ఆ ఉద్యోగుల్లో మెల్లగా అసంతృప్తి బయటపడుతున్నట్టు కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి మా తడాఖా ఏంటో చూపిస్తామంటూ ఉద్యోగులు హెచ్చరించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. సోమవారం హైదరాబాద్ లో టీఎన్జీవో అధ్యక్షుడు జగదీశ్వర్ మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ సర్కారు మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 సంఘాలతో ఉద్యోగ సంఘాల జేఏసీ స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసుకున్నామన్నారు. పదేండ్లలో ఎప్పుడూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరం కాలేదని చెప్పారు. సీపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం తీసుకు వస్తామని మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ పెట్టిందని ఆ విషయం మీద ఇప్పటికీ పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. ప్రభుత్వం వెంటనే క్యాష్ లెస్ ట్రీట్మెంట్ ఇవ్వాలన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ఉద్యోగసంఘాలను ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించలేదని ఆగ్రహించారు. భాగ్యనగర్ ఉద్యోగుల సంఘం భూమిని ఉద్యోగులకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సీఎం అమెరికా పర్యటన తర్వాత ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. లేదంటే త్వరలో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు.

Recent

- Advertisment -spot_img