Homeహైదరాబాద్latest Newsఐపీఎస్ రంగనాథ్ vs దానం నాగేందర్.. ఏం జరిగిందంటే..?

ఐపీఎస్ రంగనాథ్ vs దానం నాగేందర్.. ఏం జరిగిందంటే..?

హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ సోమవారం మీడియా సమావేశం నిర్వహించిన మరి అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్ – నందగిరి హిల్స్, గురు బ్రహ్మ నగర్ లో జీహెచ్ఎంసీ పార్క్ లో కట్టిన కాంపౌండ్ గోడను కూల్చారని కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై, అతని అనుచరులపై డీవీఎం అధికారుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

దీంతో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ పై దానం నాగేందర్ ఫైర్ అయ్యారు. ‘ఆయనకు కొత్తగా వచ్చిన పదవీ ఇష్టం లేనట్లు ఉంది. అందుకే నాపై కేసు పెట్టారు. అధికారులు వస్తుంటారు. పోతుంటారు. నేను లోకల్. ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేశాను. 190 కేసులు పెట్టారు. ఎవరికీ భయపడేటోళ్లం కాదు. గుడిసెల్లో వేలు పెట్టొద్దు. కబ్జా చేస్తేనే తీసేయ్యాలి’ అని అన్నారు.

Recent

- Advertisment -spot_img