Homeహైదరాబాద్latest Newsనేటి రాశి ఫలాలు (16-08-2024, శుక్ర‌వారం)

నేటి రాశి ఫలాలు (16-08-2024, శుక్ర‌వారం)

మేషం
ఈ రాశి వారికీ కొత్త వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. విలువైన వస్తువులు, వాహనాలు కొనుగోలు చేస్తారు. మీ ఆశయాలు సాధించేందుకు బంధువులు సహకరిస్తారు. కాంట్రాక్టులు అనుకూలిస్తాయి. విద్యార్థుల ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. చిరకాల మిత్రులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. రావలసిన డబ్బు చేతికంది. అవసరాలు తీరతాయి. రుణాలు తీరతాయి. ఇబ్బందులు తొలగుతాయి. మీ నిర్ణయాలకు ఆమోదం లభిస్తుంది. ఒకరి వివాహ విషయంలో తుది నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారాలలో క్రమేపీ లాభాలు ఆర్జిస్తారు. నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు రావచ్చు. మీ సత్తా చాటుకుంటారు. విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. రాజకీయవేత్తలు, కళాకారులకు అనుకూల సందేశం. మహిళలకు మంచి గుర్తింపు రాగలదు. శివాష్టకం పఠించండి.

వృషభం
ఈ రాశి వారికీ కొత్తగా చేపట్టిన పనులు సహా పెండింగ్ పనులు కూడా సకాలంలోనే పూర్తి చేస్తారు. భూ, వాహనయోగాలు కలుగుతాయి. ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. వేడుకలు నిర్వహణలో భాగస్వాములవుతారు. కాంట్రాక్టులు దక్కి ఉత్సాహంగా సాగుతారు. రెండుమూడు విధాలుగా ధనప్రాప్తి, షేర్ల విక్రయాల ద్వారా కూడా లాభాలు పొందుతారు. అందరి నిర్ణయాలను గౌరవిస్తారు. మీపై సోదరులు, సోదరీలు ప్రేమను చూపుతారు. మీ సత్తా అంతా గుర్తించి ప్రశంసలు కురిపిస్తారు. వివాహ యత్నాలు సానుకూలం. దీర్ఘకాలిక రుగ్మతల నుంచి బయటపడతారు. ఉద్యోగులకు కోరుకున్న పదోన్నతులు రాగలవు. విధి నిర్వహణ లో ముందడుగు వేస్తారు. వ్యాపారాలలో కోరుకున్న లాభాలు దక్కుతాయి. నూతన పెట్టుబడులు సమకూరతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఆహ్వానాలు అందుతాయి. మహిళలకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆంజనేయ దండకం మూడుసార్లు పఠించండి.

మిథునం
మిథున రాశి వారికి అనుకున్న ఉద్యోగాలు దక్కి నిరుద్యోగులు సంతోషంగా గడుపుతారు. చాకచక్యంగా కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. సొమ్ముకు ఇబ్బందులు తొలగుతాయి. జీవిత భాగస్వామి ద్వారా ధనలాభాలు పొందుతారు. మీ ప్రేమానురాగాలతో కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేస్తారు. పెద్దల సలహాలు పాటిస్తారు. వివాహాది వేడుకలు నిర్వహిస్తారు. మీ నిర్ణయాలు శిరోధార్యం కాగలవు. సంతానం నుంచి కూడా సమస్యలు తీరతాయి. రుగ్మతల నుంచి బయటపడతారు. విస్తరణ దిశగా అడుగులు వేస్తారు. పెట్టుబడులు సమకూరతాయి. భాగస్వాములతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. ఉద్యోగులకు కోరుకున్న పదోన్నతులు దక్కవచ్చు. మీపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వహిస్తారు. రాజకీయవేత్తలు, కళాకారులకు పట్టింది బంగారమే. మహిళలకు సోదరుల నుంచి ఆహ్వానాలు. శ్రీలక్ష్మీనృసింహస్తోత్రాలు పఠించండి.

కర్కాటకం
ఈ రాశి వారికీ కొత్త విషయాలు గ్రహిస్తారు. చిరకాల కోరిక నెరవేరుతుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. వాహనాలు, భూములు కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. యత్నకార్యసిద్ధి. అప్రయత్నంగా సొమ్ము అందుతుంది. ఇతరుల నుంచి రావలసిన సొమ్ము సైతం అందుకుంటారు. రుణబాధలు తొలగుతాయి. అందరూ మీ మాటే వేదంగా భావిస్తారు. భార్యాభర్తల మధ్య మరింత సఖ్యత నెలకొంటుంది. వివాహయత్నాలు కలిసివస్తాయి. సంతానపరంగా ఇబ్బందులు అధిగమిస్తారు. వ్యాపారాలలో కోరుకున్న లాభాలు ఆర్జిస్తారు. పెట్టుబడులకు ఢోకా ఉండదు. విస్తరణలోనూ విజయం సాధిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు రావచ్చు. పైస్థాయి వారి నుంచి ప్రోత్సాహం అందుతుంది. రాజకీయవేత్తలు సత్తా నిరూపించుకుంటారు. కొత్త పదవులు దక్కుతాయి. మహిళలకు ఆస్తిలాభాలు కలుగుతాయి. ఆదిత్య హృదయం పఠించండి.

సింహం
ఈ రాశి వారికీ ముఖ్యమైన కార్యక్రమాలలో అవాంతరాలు. మిత్రులు మీపై కొన్ని అభాండాలు మోపవచ్చు. అప్రమత్తంగా మెలగండి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. శ్రమ మరింత పెరుగుతుంది. కాంట్రాక్టర్లకు కొద్దిపాటి చికాకులు, ఆలయాలు సందర్శిస్తారు. కొన్ని అగ్రిమెంట్లు వాయిదా వేస్తారు. కొంత సొమ్ము అందిన అవసరాలు తీరక ఇబ్బంది పడతారు. కొత్త రుణాలు చేస్తారు. ఇన్వెస్ట్మెంట్ల విషయంలోనూ ఒడిదుడుకులు. కుటుంబసభ్యులతో లేనిపోని వివాదాలు. ఆస్తుల విషయంలో సోదరులతో విభేదాలు. నిర్ణయాలు కొన్ని మార్చుకుంటారు. కొంత ‘ నలత తప్పదు. వైద్యసేవలు పొందుతారు. వ్యాపారాలలో విస్తరణలో ఆటంకాలు, పెట్టుబడులు ఆలస్యమవుతాయి. ఉద్యోగులకు కొన్ని మార్పులు చికాకు పరుస్తాయి. శ్రమాధిక్యం. విధులు మరింత జఠిలమవుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులు కొంత నిరాశ చెందుతారు. మహిళలకు మానసిక అశాంతి. విష్ణు సహస్రనామం పారాయణ చేయండి.

కన్య
ఈ రాశి వారికీ ఆలోచనలు అందరికీ ఉపయోగపడతాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని మంచీచెడ్డా విచారిస్తారు. ఆప్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి విషయంలో చిక్కులు తొలగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. మీ ఖ్యాతి మరింత విస్తరిస్తుంది. దూరమైన వ్యక్తులు దగ్గరకు చేరతారు. కొంత సొమ్ము అనూహ్యంగా అందుతుంది. రుణబాధలు తొలగుతాయి. స్థిరాస్తి, షేర్ల విక్రయాలలో కూడా అనుకున్నంత లబ్ధి చేకూరుతుంది. సంతానపరంగా నెలకొన్న చిక్కులు సైతం తొలగుతాయి. వేడుకల నిర్వహణలో పాలుపంచు కుంటారు. వ్యాపారాలలో విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. నూతన పెట్టుబడులు సమకూరతాయి. లాభాలు ఆశించినంతగా దక్కుతాయి. ఉద్యోగులకు కోరుకున్న అవకాశాలు లభిస్తాయి. విధి నిర్వహణలో అవాంతరాలు అధిగమిస్తారు. పారిశ్రామికవేత్తలకు ఊహించని విదేశీ పర్యటనలు, మహిళలకు మానసికోల్లాసం. ఆదిత్యహృదయం పఠించండి.

తుల
ఈ రాశి వారికీ కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. మిత్రులతో వివాదాలు తీరి కొంత ఉపశమనం. పొందుతారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. శ్రమపడ్డా ఫలితం పొందుతారు. చిరకాల స్వప్నం నెరవేరుతుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. అవసరాలకు తగినంతగా సొమ్ము. అందుతుంది. రుణదాతలు ఒత్తిడులు తగ్గిస్తారు. ఆస్తుల విక్రయాల ద్వారా కొంత సొమ్ము అందుకుంటారు. అందరితోనూ సఖ్యతగా మసలుకుంటారు. జీవితభాగస్వామి నుంచి తగినంత ప్రోత్సాహం అందుతుంది. సోదరులు, సంతానం నుంచి ఇబ్బందులు తొలగుతాయి. కొన్ని రుగ్మతల నుంచి బయటపడి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాలలో కోరుకున్న లాభాలు అందుతాయి. పెట్టుబడులకు ఢోకా ఉండదు. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. పైస్థాయి వారి ప్రశంసలు అందుతాయి. కళాకారులకు నూతనోత్సాహం, సత్కారాలు అందుతాయి. మహిళలకు విశేష గౌరవం లభిస్తుంది. ఈశ్వరారాధన మంచిది.

వృశ్చికం
ఈ రాశి వారికీ వ్యయప్రయాలతో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. మిత్రులు శత్రువులుగా మారే ” సూచనలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ శక్తియుక్తులు వృథా కాగలవు. ఇంటి నిర్మాణాలలో అవాంతరాలు. నిరుద్యోగులు తమ ప్రయత్నాలను వాయిదా వేసుకుంటారు. సొమ్ముకు ఇబ్బందులు పడతారు. స్నేహితులను ఆశ్రయించి సహాయం కోరతారు. కొంత సొమ్ము చేజారవచ్చు. అందరితోనూ వివాదాలు నెలకొంటాయి. ఆస్తుల పంపకాలు ఎటూతేలకుండా వాయిదా పడతాయి. కొంత నలత చేస్తుంది. అయితే వైద్యసేవలతో ఉప శమనం పొందుతారు. వ్యాపారాలలో మరింత విస్తరిం చేందుకు ప్రయత్నిస్తారు. అయితే భాగస్వా ములతో తగాదాలు నెలకొని ప్రతిష్టంభన తప్పదు. ఉద్యోగులు పనిభారంతో సతమతమవుతారు. ఉన్నతాధికారుల ఒత్తిడులకు తలొగ్గవలసిన పరిస్థితి. పారిశ్రామిక వేత్తలకు పర్యటనల్లో ఆటంకాలు. మహిళలకు సోదరులతో కలహాలు. శ్రీరామ స్తోత్రాలు పఠించండి.

ధనుస్సు
ఈ రాశి వారికీ మనస్సులో అనుకున్న వెంటనే పనులు చేపట్టి పూర్తి చేస్తారు. ఆత్మీయులతో సంతోషకరంగా గడుపుతారు. ఇంతకాలం ఎదురైన కొన్ని సమస్యలు తీరతాయి. పరిచయాలు విస్తృతమవుతాయి. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వివాహయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. బంధువుల ద్వారా ధనలాభాలు కలుగుతాయి. పెద్దల ఆశీస్సులు, సలహాలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. మీ ఆలోచనలు అమలులో పెట్టి అందరి ప్రశంసలు అందుకుంటారు. సోదరులు, సోదరీలతో విభేదాలు పరిష్కారం. వ్యాపార విస్తరణ యత్నాలు ముమ్మరం చేస్తారు. కొత్త భాగస్వాములతో అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఉద్యోగులకు అనుకూల మార్పులు సంభవం, ఉన్నతాధికారులు మీరంటే మరింత ఇష్టపడే సమయం. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. మహిళలకు ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. నవగ్రహ స్తోత్రాలు పఠించండి.

మకరం
ఈ రాశి వారికీ ఉరకలెత్తే ఉత్సాహంతో ముందుకు సాగి కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. కొత్త ఆలోచనలతో నిర్ణయాలు తీసుకుంటారు. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేసే వీలుంది. కొన్ని వివాదాలు, సమస్యలు నేర్పుగా పరిష్కరించుకోవడంలో సత్తా చాటుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. రావలసిన డబ్బు అందుతుంది. రుణభారాలు తొలగి ఊరట చెందుతారు. స్థిరాస్తుల్లో పెట్టుబడులు అందుతాయి. కుటుంబసభ్యులతో సఖ్యత నెలకొంటుంది. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. సోదరులతో ఆస్తి విషయంలో అంగీకారానికి వస్తారు. ఇంతకాలం ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యలు తీరి ఊపిరిపీల్చుకుం టారు. వ్యాపారాలలో లాభాల బాటలో పయనిస్తారు. భాగస్వాములు మరిన్ని పెట్టుబడులు సమకూరుస్తారు. ఉద్యోగులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. ఉన్నతపో స్టులు ఎట్టకేలకు దక్కే సూచనలు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు క్లిష్టసమస్యలు తీరతాయి. మహిళల ఆశ యాలు నెరవేరతాయి. అంగారక స్తోత్రం పఠించండి.

కుంభం
ఈ రాశి వారికీ అనుకున్న కార్యక్రమాలలో ప్రతిబంధకాలు తొలగి ముందుకు సాగుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. మిత్రులు మీ ఉన్నతికి కొంత సహాయపడడం విశేషం. కాంట్రాక్టర్లకు కలసివచ్చే సమయమే. ఆకస్మిక ధనలాభాలతో అవసరాలు తీరతాయి. ఆస్తుల విక్రయాలు కూడా సజావుగా పూర్తి చేసి మరింత సొమ్ము సమకూర్చుకుంటారు. మీ ప్రేమాభిమానాలతో కుటుంబసభ్యులు ఆనందిస్తారు. మీ నిర్ణయాలు సోదరులతో పంచుకుంటారు. తండ్రి తరఫున కొంత ఆస్తిలాభం కలిగే అవకాశం. సంతానపరంగా శు భవార్తలు. మధ్యలో కొంత నలత చేసి ఇబ్బంది. పడతారు. వ్యాపారాలలో క్రమేపీ ఆశించిన లాభాలు దక్కించుకుంటారు. పెట్టుబడులకు లోటు రాదు. ఉద్యోగులు విధుల్లో మీ సమర్థతను చాటుకుంటారు. ఉన్నతాధికారులను మెప్పిస్తారు. రాజకీయవేత్తలు, కళాకారులకు అంచనాలు ఫలిస్తాయి. మహిళలకు మనశ్శాంతి లభిస్తుంది. శ్రీరామస్తోత్రాలు పఠించండి.

మీనం
మీన రాశి వారికి స్నేహితుల నుంచి ఒత్తిడులు ఎదురైనా క్రమేపీ అధిగమిస్తారు. అవసరాలకు తగినంత సొమ్ము సమ కూరుతుంది. ఇతరుల నుంచి రావలసిన బాకీలు అందుకుంటారు. ఆపదలో ఉన్న వారికి ధనసహాయం అందిస్తారు. స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెడతారు. మీపై బంధువుల్లో మరింత ఆదరణ పెరుగుతుంది. ఏ విషయమైనా మీతో చర్చించకుండా ముందుకు సాగరు. అలాగే, సంతానపరంగా నెలకొన్న కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. కొంత అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారాలలో మీరు ఆశిం చిన రీతిలో లాభాలు దక్కినా పెట్టుబడులు ఆలస్యమ వుతాయి. భాగస్వాముల నుంచి కొంత ఒత్తిడులు తప్పకపోవచ్చు. ఉద్యోగులకు విధి నిర్వహణలో చికాకులు క్రమేపీ తొలగుతాయి. కొత్త బాధ్యతలు చేపట్టాల్సి వస్తుంది. రాజకీయవేత్తలు, కళాకారులు, వైద్యులకు గతం కంటే అనుకూలమైన పరిస్థితి ఉంటుంది. మహిళలకు మనోధైర్యం పెరుగుతుంది. ఆదిత్య హృదయం మూడుసార్లు పఠించండి.

Recent

- Advertisment -spot_img