శ్రావణమాసంలో వరుస శుభకార్యాలు, వరలక్ష్మీ వ్రతం కారణంగా పూల ధరలు మూడింతలు పెరిగాయి. వాతావరణ మార్పులతో దిగుబడి తగ్గడం వల్లే ధరలు భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. గత నెలలో మల్లెల ధర కేజీ రూ.550 ఉండగా.. ఇప్పుడు రూ.1,500 పలుకుతోంది. తెల్ల చామంతి రూ.200 నుంచి రూ.350, కనకాంబరం రూ.100 నుంచి రూ.300, పసుపు చామంతి రూ.150 నుంచి రూ.400, లిల్లీ రూ.150 నుంచి రూ.500, జాజులు రూ.300 నుంచి రూ.1,200కు చేరాయి.