హైదరాబాద్ మెట్రో విస్తరణకు రంగం సిద్దమైనట్లు తెలుస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ మెట్రో విస్తరణ పైన అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ సిటీ నుంచి ఫోర్త్ సిటికి రవాణా సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త సిటీకి రహదారి, మెట్రో రైలు మార్గాలను నిర్మించాలని అధికారులకు సూచించారు. నగరంలో కొత్త మెట్రో రూటుకు శ్రీకారం చుట్టారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి రూట్ మ్యాప్ ను అధికారులు సీఎం ముందుకు ప్రతిపాదించారు..