ఇదే నిజం, గొల్లపల్లి: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలోని స్థానిక రెడ్డి సంఘంలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో 60వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.తెలంగాణ ప్రాంత గో రక్షక్ వెంకన్న మాట్లాడుతూ హిందువులందరూ ఏకతాటిపై ఉండి గోవులను రక్షించాలని అన్నారు.విశ్వహిందూ పరిషత్ 60 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా ఈ 60 సంవత్సరాల్లో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది.హిందువుల చిరకాల కోరిక అయిన అయోధ్య రామ మందిరం నిర్మాణం కూడా ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా గో రక్షక్ ప్రముక్ రామకృష్ణారెడ్డి, బెజ్జంకి సుభాష్,జిల్లా గో సహాయక ప్రముక్ ఆడేపు నరేష్,విశ్వహిందూ పరిషత్ గొల్లపల్లి మండల అధ్యక్షులు కుంభార్ కార్ అరుణ్,విశ్వహిందూ పరిషత్ ప్రధాన కార్యదర్శి ఆవుల వెంకటేష్,బజరంగ్ దళ్ మండల్ కన్వీనర్ ఎనగందుల రమేష్,శ్రీ కోటి నీలకంఠం,హిందూ బంధువులందరూ పాల్గొన్నారు.