ఛత్తీస్‌గఢ్‌లో మరో దారుణం వెలుగుచూసింది. రాఖీ పండగ రోజు కొందరు కీచకులు గిరిజన మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. రాయ్‌గఢ్ జిల్లాకు చెందిన 27 ఏళ్ల గిరిజన మహిళ సోమవారం రాఖీ పండగ సందర్భంగా తమ ఊరిలో జరుగుతున్న వేడుకకు హాజరవడానికి వెళ్లింది. మార్గమధ్యలో ఆరుగురు దుండగులు ఆమెను అడ్డగించి, సమీపంలోని చెరువు వద్దకు లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన అనంతరం మహిళ స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది.