కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఘాటు కౌంటర్ ఇచ్చారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని టచ్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయమైన తెలంగాణ భవన్ పునాదులు లేస్తాయని హెచ్చరించారు. తెలంగాణ కోసం తాము ఎన్నో ఉద్యమాలు చేశామని అన్నారు. కేసీఆర్ మాదిరిగా దొంగ దీక్షలు చేయలేదని విమర్శించారు.