పొట్లకాయలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా లాభాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. పొట్లకాయలో విటమిన్ ఎ, బీ1, బీ2, బీ3, బీ6, బీ9, సితో పాటు కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, పాస్పరస్, సోడియం, జింక్ వంటి ఖనిజాలు ఉంటాయి. పొట్లకాయను తినడం వల్ల హార్ట్ ఎటాక్‌లు రాకుండా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఎముకలు దృఢంగా మారుతాయి. ముఖ్యంగా జ్వరం వచ్చిన వారు, కామెర్లు అయిన వారు పొట్లకాయలను తింటే త్వరగా కోలుకుంటారని నిపుణులు సూచిస్తున్నారు.