Homeహైదరాబాద్latest Newsరోడ్డు పై డబ్బులు వెదజల్లి హంగామ‌.. యూట్యూబర్ హర్ష పై కేసు నమోదు..!

రోడ్డు పై డబ్బులు వెదజల్లి హంగామ‌.. యూట్యూబర్ హర్ష పై కేసు నమోదు..!

యూట్యూబర్ హర్ష పవన్ తాజాగా కూకట్ పల్లిలో మొత్తం 50 వేల.. 100 రూపాయల నోట్ల కట్టలను గాలిలోకి విసిరాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఈ విషయం పై మీడియా సీరియస్ అయింది. యూట్యూబర్ చేసిన రచ్చపై ఇప్పటికే హైదరాబాద్, సైబరాబాద్‌లలో కేసులు నమోదయ్యాయి. రోడ్డుపై డబ్బులు వెదజల్లి హంగామ‌ చేసిన యూట్యూబర్‌పై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. యూట్యూబర్ హర్షపై సైబరాబాద్ పోలీసులు రెండు పోలీస్ స్టేషన్లలో కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌లో మరో కేసు నమోదైంది.

Recent

- Advertisment -spot_img