Homeజిల్లా వార్తలుఆర్ కే వై టీం సేవా కార్యక్రమాలు హర్షణీయం: రవి కుమార్ యాదవ్

ఆర్ కే వై టీం సేవా కార్యక్రమాలు హర్షణీయం: రవి కుమార్ యాదవ్

ఇదేనిజం, శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఆర్ కే టీం చేస్తున్న సేవాకార్యక్రమాలు హర్షణీయమని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవి కుమార్ యాదవ్ అన్నారు. నిరుపేదలు, ఫుట్ పాత్ ల పై నివసిస్తున్న అభాగ్యులకు వర్షాలకు తలదాచుకోవడానికి గొడుగుల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన చేతుల మీదుగా గోపనపల్లిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం వర్షాలకు తలదాచుకోవడానికి గొడుగుల పంపిణీ కార్యక్రమం చేపడుతున్న ఆర్ కే వై టీం సభ్యులను అభినందించారు. ఎక్కడ ఆపద సంభవించిన ముందుండి తమ వంతు సహాయంగా ఆర్ కే వై టీం సభ్యులు సహాయ సహకారాలు అందించడం అభినందనీయమన్నారు. వేసవికాలంలో చలివేంద్రాలు, వర్షాకాలంలో గొడుగులు, చలికాలంలో దుప్పట్లు అనేక సేవాకార్యక్రమాలను చేపట్టి పేదవారికి మేమున్నాము అనే భరోసా కల్పిస్తున్నందుకు టీం సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీలకు అతీతంగా, సేవ చేయడంలో సందయ్య మెమోరియల్ ట్రస్ట్, ఆర్ కే వై టీం సభ్యులు ఎల్లప్పుడూ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీం సభ్యులు బిజెపి పార్టీ సీనియర్ నాయకులు ఆకుల లక్ష్మణ్ ముదిరాజ్, జాజి రావు శ్రీనివాస్, రాము, నరేష్, శంకరయ్య పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img