మెట్రోస్టేషన్ల వద్ద పెయిడ్ పార్కింగ్ అమలు చేయడంపై మెట్రో అధికారులు మరోసారి వెనక్కి తగ్గారు. ప్రయాణికుల సమస్యలను పరిష్కరించేందుకు పెయిడ్ పార్కింగ్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. నాగోల్, మియాపూర్ మెట్రో స్టేషన్ల వద్ద ఫ్రీ పార్కింగ్ సదుపాయం పునరుద్ధరించాలని రేపు నాగోల్‌లో ప్రయాణికులు మహాధర్నా చేయనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.