ఇదేనిజం, శేరిలింగంపల్లి: పటేల్ గూడ నుండి బీరంగూడ మీదుగా మెహిదీపట్నం వరకు 216M/P రూట్ నందు రెండు బస్సులను ఈ నెల 30 తేది నుండి ప్రారంభిస్తున్నట్టు మియాపూర్-2 డిపో మేనేజర్ వెంకటేశం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ బస్సు పటేల్ గుడా నుండి బయలుదేరి బీరంగూడ, లింగంపల్లి, అల్విన్ క్రాస్ రోడ్స్, కొండాపూర్, హైటెక్ సిటీ, రాయదుర్గం మెట్రో స్టేషన్, టోలిచౌకి మీదుగా మెహిదీపట్నం వెళుతుంది. ఈ యొక్క అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని డిపో మేనేజర్ కోరారు. ఈ బస్సులు పటేల్ గూడ నుండి మెహిదీపట్నం బయలుదేరు వేళలు.5:50, 8:00, 9:00, 11:10, 16:20, 17:20, 19:45, 20:45 నడుస్తున్నట్లు తెలిపారు.