జియో యూజర్లకు రిలయన్స్ శుభవార్త చెప్పింది. రిలయన్స్ వార్షిక సాధారణ సమావేశంలో కంపెనీ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ జియో యూజర్లకు ఆఫర్ ప్రకటించారు. యూజర్లకు 100 జీబీ ఫ్రీ క్లౌడ్ స్టోరేజీ ఇవ్వనున్నట్లు తెలిపారు. దీపావళి నుంచి ఏఐ క్లౌడ్ స్టోరేజీ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. హలో జియో పేరిట జియో సెటప్ బాక్స్ కోసం టీవీ ఓఎస్‌ను తీసుకురానున్నట్లు వెల్లడించారు. అలాగే రిమోట్లో కొత్తగా ఏఐ బటన్ ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు.