Homeజిల్లా వార్తలుపార్టీలకు అతీతంగా అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తాం

పార్టీలకు అతీతంగా అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తాం

  • ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి

ఇదేనిజం, కంగ్టి: పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతిఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ సంక్షేమ పథకాలు అందజేస్తామని నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి అన్నారు. గురువారం కంగ్టిలోని బస్వప్రదీప్ కల్యాణ మండపంలో 61 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణి చేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ…పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిచడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు హామీలను నెరవేర్చడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందాని అన్నారు.గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంతో మంది కళ్యాణ లక్ష్మి చెక్కులను ఆపడం జరిగింది.వాళ్లు కాంగ్రెస్ పార్టీ అని తెలిస్తే చాలు వాళ్ళ చెక్కులను ఆపి వారికి అనేక ఇబ్బందులకు గురి చేశారు.4 సంవత్సరాల నుండి ఆపిన కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను కూడ ప్రజాపాలనలో వచ్చాక అందరికి చెక్కులు అందిచమని అన్నారు. కాంగ్రెస్ పాలనలో పార్టీలకతీతంగా పేద మధ్య తరగతి ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విష్ణు సాగర్, చైర్మన్ మారుతీ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాలొగొన్నారు.

Recent

- Advertisment -spot_img