Homeజిల్లా వార్తలువిద్యార్థులు విద్యాతో పాటు క్రీడారంగలో రాణించాలి: ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి

విద్యార్థులు విద్యాతో పాటు క్రీడారంగలో రాణించాలి: ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి

ఇదేనిజం, నిజాంపేట్: విద్యార్థులు విద్యాతో పాటు క్రీడారంగంలో రాణించాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పి.సంజీవరెడ్డి అన్నారు. శుక్రవారం నిజాంపేట్ మండల కేంద్రంలోని జడ్.పి.హెచ్.ఎస్ ఉన్నత పాఠశాలలో ఎస్ జి ఎఫ్ గేమ్స్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థిని విద్యార్థులకు చదువుతోపాటు అప్పుడప్పుడు వారిలోని ప్రతిభను గుర్తించి క్రీడలను ప్రోత్సహించాలని అన్నారు. అలాగే పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులకు క్రీడల గొప్పతనం గురించి చెప్పాలి అన్నారు. విద్యార్థులు ధ్యాన్ చాంద్ ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాలి అన్నారు. ధ్యాన్ చాంద్ మన దేశానికి ఒలంపిక్స్ క్రీడల్లో ఎన్నో గోల్డ్ మెడల్ బహుమతులను అందించరని కొనియాడారు. క్రీడల వలన మీఆరోగ్యం మంచిగా ఉంటుందని అన్నారు. ఆటలతో విద్యార్థుల జ్ఞాపక శక్తి పెరుగుతుందాని అన్నారు.విద్యార్థులకు విద్యతో పాటు క్రీడాలను కూడా ప్రోత్సహించాలని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో MEO గారు మరియు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు అలాగే ప్లేయింగ్ టీచర్ మరియు విద్యార్థిని విద్యార్థులు మరియు వారితో పాటు,మండల నాయకులు శంకర్ గౌడ్,రాధ కిషన్ సెట్,మల్లేష్,లింగ రెడ్డి,కృష్ణ మాజీ mptc,శ్రీకాంత్ నిజాంపేట్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img