Homeజిల్లా వార్తలుస్కూల్ ఫెడరేషన్ గేమ్స్ ప్రారంభం

స్కూల్ ఫెడరేషన్ గేమ్స్ ప్రారంభం

ఇదే నిజం, దేవరకొండ: డిండి మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం 68వ స్కూల్ ఫెడరేషన్ గేమ్స్ ను ప్రధానోపాధ్యాయులు పాపిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డివిజన్స్ స్థాయిలో నిర్వహించే పోటీలలో మండల స్థాయిలో సెలక్షన్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుందని వారు అన్నారు వాలీబాల్ కోకో కబడ్డీ క్రీడాంశాలలో డివిజన్ స్థాయి సెలెక్షన్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు ఇద్దయ్య, యాదయ్య, శ్రీను, జ్యోతి, నవనీత మరియు మండలంలోని వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img