విద్యుత్ సంస్థల్లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. జాబ్ క్యాలెండర్ ప్రకారం అక్టోబరులో విద్యుత్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీచేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఖాళీల వివరాలు సేకరిస్తోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం 4 విద్యుత్ సంస్థల్లో 3 వేలకు పైగా ఖాళీలున్నాయి. వీటి సంఖ్య ఇంకా పెరగవచ్చని అంచనా. ఈ లెక్కలు తేలితే వచ్చే నెలలో నోటిఫికేషన్లు జారీచేసే ఛాన్స్ ఉందని అధికారులు చెబుతున్నారు.