విజయవాడను భారీ వర్షం, వరదలు ముంచెత్తాయి. సీఎం చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు పరిస్థితిని దగ్గరుండి సమీక్షిస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ సైతం వరద బాధితులను పరామర్శించి వెళ్లారు. ఈ ఎపిసోడ్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఆయన పుట్టిన రోజు సందర్భంగానైనా బయటకు రాలేదు. దీంతో పవన్ ఎక్కడ ఉన్నారోనని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.