ఇదే నిజం, అచ్చంపేట: అచ్చంపేట నియోజకవర్గం వంగూర్ మండల పరిధిలోని కిప్టంపల్లి గేట్ సమీపంలో మంగళవారం 765జాతీయ రహదారిపై TS09FH0986 నెంబర్ గల కారు హైదరాబాద్ నుండి డిండి వైపు ప్రయాణం అవుతుండగా కారు అదుపుతప్పి బోల్తాపడింది. అందులో 4ప్రయాణిస్తున్నారు. ప్రమాదవశాత్తు సంఘటన స్థలంలో ఒక మహిళ మృతి చెందగా, మరో ముగ్గురుకి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించినట్లు తెలుస్తుంది. ఈ ఘటన సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.