తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా ఇళ్లలోకి వరదనీరు చేరింది. ఎటు వెళ్లాలోె దిక్కుతోచని పరిస్థితి. ఆహారం అందక, తాగు నీరు దొరక్క, చివరికి పసిపిల్లలకు గుక్కెడు పాలు కరువై అలమటిస్తున్న హృదయ విదారక దృశ్యాలు ఎంతటి వారి మనసులైనా తరుక్కుపోతాయి. లక్షల మంది ప్రజలు ముంపులో చిక్కుకొని తమను రక్షించే వారి కోసం గంటల కొలది ఎదురు చూస్తున్న దయనీయ పరిస్థితి. కరెంట్ లేక, నిద్రలేక, ఏ క్షణం ఏమవుతుందో తెలియక ప్రాణాలు అరచేత పట్టుకొని క్షణక్షణం నరకం చూసారు.